స్వర్ణ కాంతుల 'వెండి వెన్నెల'
తెలుగు సినిమా స్వర్ణోత్సవ కాంతులీనుతోంది. 75 వసంతల పైబడిన తెలుగు సినిమా ప్రాభావాన్ని అవలోకిస్తే ఎన్నో ఆణిముత్యాలు దొరుకుతాయి. సినీ స్వర్ణయుగ కీర్తిని అక్షరబద్ధం చేసి సువర్ణ పెళ్లెరంలో అందించే అమూల్య ప్రయత్నమే 'వెండివెన్నెల' పుస్తక సంకలనం. వెండితెరపై వెన్నెల కురుస్తుంటే ఆస్వాదించలేని వారుండనట్టే పాత చిత్రాల తేనెలను నిండుగా పూసి అలనాటి చిత్రరాజాలను పుస్తక రూపంలో నిక్షిప్తం చేసే ప్రయత్నం ఓ ఒక్కరు చేసినా రుచించని వారుండరు. ఇందుకు ఎంతో శ్రమ, పట్టుదలతో కూడిన పరిశోధన అవసరం. శోధించి సాధించాలి. సినీ పాత్రికేయుడుగా 25 ఏళ్ల అనుభవం ఉన్న వినాయకరావు 'వెండివెన్నెల' పేరుతో 'మళ్లీ మళ్లీ నిర్మించిన సినిమాల ముచ్చట్లు' అలాంటి అపురూపు అరుదైన ప్రయత్నమే. తొలి తెలుగు టాకీ పుట్టిన రోజునాడే ఆయన 'వెండివెన్నెల'ను ఆవిష్కరించి ఒక పరిశోధకుడుగా, నిరంతరాన్వేషిగా, సినీ పాత్రికేయుడుగా తన నిబద్ధతను చాటుకున్నారు. తన రచనకు గత వైభవాన్ని అద్ది...ఒకే పేరుతో, కథాంశంతో మళ్లీ మళ్లీ వచ్చిన సినిమాల విశేషాలను ఇందులో అందించారు.
టాకీల యుగం నుంచి తెలుగులో వచ్చిన కొన్ని చిత్రాలు తిరిగి సరికొత్త నగిషీలతో నిర్మాణమయ్యాయి. అప్పటి దర్శకులు, నిర్మాతలు, నటులు ఎలాంటి నిబద్ధత కలిగి ఉండేవారు? నటులు ఎలాంటి కట్టుబాట్లు, క్రమశిక్షణ పాటించేవారు? షూటింగ్స్ లో తలెత్తిన ఇబ్బందులు, వాటిని విజయవంతంగా ఎలా దాటగలిగారు వంటి విషయాలను రచయిత ఎంతో ఓర్పు, నేర్పుతో సేకరించి ఇందులో పొందుపరిచారు.1931లో వచ్చిన తొలి టాకీ 'భక్త ప్రహ్లాద'తో మొదలుపెట్టి 'రామాంజనేయ యుద్ధం' వరకూ 63 సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మళ్లీ మళ్లీ నిర్మించబడినవే. తెలుగులో టాకీ చిత్రాలను ప్రారంభం చేసిన పూర్ణా మంగరాజు గురించిన వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఈ చరిత్రలో 'భక్తప్రహ్లాద', 'రామదాసు', 'సతీసావిత్రి', 'సీతారామకల్యాణం', 'లవకుశ', 'హరిశ్చంద్ర', 'శ్రీకృష్ణతులాభారం', 'సతీసక్కుబాయి', 'విప్రనారాయణ', 'మాయాబజారు', 'భూకైలాస్', 'త్యాగయ్య', 'దేవదాసు', 'లక్ష్మమ్మ', 'భీష్మ', 'అనార్కలి' వంటి మేలిమి ముత్యాలు ఉన్నాయి.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|