స్వర్ణ కాంతుల 'వెండి వెన్నెల'
సినిమాల నిర్మాణ, వ్యయ ఇతర వివరాలకే పరిమితం కాకుండా ఆనాటి ఆసక్తికరమైన విషయాలను కూడా రచయిత సందర్భానుసారం తెలియజేయడం ఆసక్తికరం. 1942లో రెండోసారి తీసిన 'భక్తప్రహ్లాద' చిత్రంలో ప్రహ్లాదుని పాత్ర పోషించిన జి.వరలక్ష్మి ఆ చిత్ర నిర్మాత డబ్బు ఇవ్వలేదని చెట్టింకిందనే విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. 'కృష్ణవేణి' షూటింగ్ మద్రాసు బీచ్ లో జరుగుతుండగా అక్కడకు వచ్చిన ఓ మిలటరీ గ్యాంగ్ హీరోయిన్స్ శాంతకుమారి, భానుమతిని అల్లరి పెట్టడం, 'మోహినీ భస్మాసుర' షూటింగ్ లో ఎ.వి.సుబ్బారావు కందిరీగలతో ఇబ్బంది పడటం, అలాగే 'శ్రీలక్ష్మమ్మ కథ'ను ఘంటసాల బలరామయ్య, గోపీచంద్ పోటీగా సినిమాలు తీసి ఒకేరోజు విడుదల చేయడం వంటి అరుదైన విషయాలు కనిపిస్తాయి. అలాగే కాళ్లకూరి సదాశివరావు గారు ఈలపాటి రఘురామయ్యతో తన చిత్రాల్లో ఎలా ఈల పాటలు పాడించారో, సి.పుల్లయ్య, హెచ్.ఎం.రెడ్డి విడివిడిగా నిర్మించిన 'సతీసావిత్రి' చిత్రం ఒకే ఏడాది విడుదలవడం, వి.శాంతారాం 'సజా' అనే కెమెరాతో భారతదేశంలోనే తొలిసారి స్లో మేషన్ సన్నివేశాలు తీయడం వంటి అరుదైన విషయాలు ఇందులో చోటుచేసుకున్నాయి.
విషయ సేకరణ కోసం రెండేళ్ల పాటు ఎన్నో ఊళ్లు తిరిగి, ఎందర్నో కలిసినట్టు రచయిత చెప్పుకొన్నారు. ముఖ్యంగా ఈ పుస్తకంలో అరుదైన ఫోటోలు, వాటి సేకరణ వెనుక రచయిత కృషి-పట్టుదల కనిపిస్తాయి. సినిమాలోని లేని వర్కింగ్ స్టిల్స్ కూడా ఈ గ్రంథంలో చూడవచ్చు. తన ప్రయత్నంలో పొరపాట్లు దొర్లితే వాటిని తన దృష్టికి తీసుకు వస్తే ద్వితీయ ముద్రణలో సరిచేసుకుంటానని రచయిత సవినయంగా చెప్పడం ముచ్చటేస్తుంది. 149 చిత్రాల దర్శకుడు...గిన్నెస్ హోల్టర్ దర్శకరత్న దాసరి నారాయణరావు 'వెన్నెల తెల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఇది లోకానికి తెలిసిన నిజం. వెన్నెల తెల్లగా ఉండి మెరవడమే వెండివెన్నెల. ఇది కవులు వాడే ప్రయోగం. కానీ, వినాయకరావు వెండివెన్నెల పుస్తక సంకలనం, వెండివెన్నెల కాదు. అప్పుడప్పుడు పచ్చగా కనిపించే ఆకాంశం-బంగారుఛాయ' అని ముందుమాటలో చెప్పినట్టు నిజంగానే తెలుగు స్వర్ణయుగపు వైభవాన్ని, ఒక పోటీతత్వాన్ని సమగ్రంగా రచయిత ఇందులో విశ్లేషించారు. పాత చిత్రాల ప్రియులకు ఇది నిస్సందేహంగా అమూల్య రత్నమే. దాచుకుని భవిష్యత్ తరాలకు అందిచొచ్చు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|