23న 'బంపర్ ఆఫర్'
సాయిరామ్ శంకర్ కథానాయకుడుగా వైష్ణో ఆకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ నిర్మించిన చిత్రం 'బంపర్ ఆఫర్'. పూరీ జగన్నాథ్ శిష్యుడు జయరవీంద్ర దర్శకుడు. ఈనెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్ తెలిపారు.
సాయిరాం శంకర్ ఈ చిత్రంలో సరికొత్త లుక్ తో కనిపించడంతో పాటు అద్భుతమైన పెర్ ఫారమెన్స్ చేశారనీ, హీరోయిన్ గా బిందుమాధవి ('ఆవాకాయ్ బిర్యానీ' ఫేమ్) నటించిందనీ ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని ఎంటర్ టైన్ మెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఇటీవల పూరీ సంగీత్ ద్వారా విడుదలైన ఆడియో పెద్ద హిట్టయిందనీ, అన్ని సెంటర్స్ నుండి రిపీటెడ్ ఆర్డర్లు వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. రఘు కుంచె సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, గతంలో వైష్ణో అకాడమీ బ్యానర్ నిర్మించిన 'ఇడియట్', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' వంటి హిట్ చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా బంపర్ హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఆలీ, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, రక్ష, కోవై సరళ తదితరులు నటించారు. కథ-మాటలు పూరీ జగన్నాథ్ అందించిన ఈ చిత్రానికి భాస్కరభట్ల పాటలు, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, చిన్నా ఆర్ట్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|