సింధుతులానీ ప్రేమ పెళ్లి?
గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తున్న సింధుతులానీ త్వరలోనే వివాహం చేసుకోనుందనీ, అది కూడా ప్రేమ పెళ్లనీ చెన్నై సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. టాలెంటెడ్ యువ దర్శకుడు సురేంద్రరెడ్డిని ఆమె పెళ్లాడనుందని ఆ వార్తల సారాంశం.
సింధుతులాని తెలుగుతో పాటు తమిళంలో కూడా డజనుకు పైగా సినిమాల్లో నటించింది. ధనుష్ కథానాయకుడుగా నటించిన 'సుళ్లాన్' అనే తమిళ చిత్రంలో తొలిసారి నటించిన సింధు ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టింది. 'అతనొక్కడే', 'విక్టరీ', 'హరేరామ్', 'నా మనసుకు ఏమయింది', 'బతుకమ్మ' వంటి పలు చిత్రాలల్లో ఆమె నటించింది. సింధు నటించిన 'అతనొక్కడే' చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే ఆ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే వాటిని సురేంద్రరెడ్డి తోసిపుచ్చారు. ఇలాంటి వార్తలు ఎక్కడ్నించి పుడతాయో తనకు తెలియడం లేదని స్పష్టం చేశారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ త్వరలో పెళ్లాడనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. సురేంద్రరెడ్డి 'అశోక్', 'అతిథి' వంటి చిత్రాల తర్వాత దర్శకత్వం వహించిన 'కిక్' చిత్రం ఈ ఏడాది మంచి హిట్ సాధించింది. తదుపరి చిత్రాన్ని కూడా 'కిక్' నిర్మాతలైన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కు చేయనున్నట్టు తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|