?పూరీ జగన్నాథ్ తో 'బుజ్జిగాడు' తర్వాత చేసిన సినిమా ఇది. ఎలా ఫీల్ అయ్యారు
-పూరీ నా డార్లింగ్. ఆయనతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీ. మళ్లీ ఆయన చేద్దాం అంటే వెంటనే పనిచేయడానికి నేను రెడీ. మా కాంబినేష్ లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఉఁటాయి. 'ఏక్ నిరంజన్' ఆ అంచనాలను రీచ్ అవుతుంది. తప్పకుండా హిట్ అవుతుంది.
?'ఏక్ నిరంజన్' మ్యూజిక్ గురించి
- మణిశర్మ గారు 'బిల్లా' చిత్రంలో 'బొమ్మాలీ..' అనే సూపర్ హిట్ పాటిచ్చారు. 'ఏక్ నిరంజన్'లో అన్ని పాటలు బాగా చేశారు. ముఖ్యంగా
'ఏక్ నిరంజన్' టైటిల్ సాంగ్ నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ అవుతుంది. 'వర్షం' తర్వాత నాకు మంచి మ్యూజికల్ హిట్ గా ఈ చిత్రం నిలబడుతుంది.
?సినిమాలో యాక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది
-రగ్డ్ గా ఉంటుంది. స్టన్ శివ యాక్షన్ చాలా బాగా తీశారు. ప్రతి సీన్ లోనూ ఏదో ఒక యాక్షన్ ఉంటుంది. ఈ కథ అలాంటింది. ముఖ్యంగా క్లైమాక్స్ హైలైట్. నా సినిమాల్లో బెస్ట్ క్లైమాక్స్ గా దీనిని చెప్పుకోవచ్చు.