బర్త్ డే గిఫ్ట్ 'ఏక్ నిరంజన్'
?ఆదిత్యరామ్ బ్యానర్ లో ఫస్ట్ టైమ్ చేశారు కదా...
-ఆదిత్యరామ్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. చాలా లావిష్ గా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు. ఈ బ్యానర్ లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే సినిమా ప్రమోషన్ కూడా భారీగా చేస్తారని ఆశిస్తున్నాను.
?'ఏక్ నిరంజన్'లో ఇంకేమి హైలైట్స్ ఉన్నాయి
-హీరో క్యారెక్టరైజేషన్, పూరీ జగన్ రాసిన సంభాషణలు, సంగీతం, యాక్షన్...ఇలా అన్నీ హైలైట్సే. ఒక్కమాటలో చెప్పాలంటే పూరీ అందిస్తున్న మంచి కమర్షియల్ ప్యాకేజి ఈ 'ఏక్ నిరంజన్'.
?మీ కొత్త చిత్రాలు
- కరుణాకరన్ దర్శకత్వంలో ప్రసాద్ గారు నిర్మిస్తున్న చిత్రం స్విట్జర్లాండ్ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్, అరకులో మరో షెడ్యూల్ ఉంటుంది. సమ్మర్ లో సినిమా రిలీజ్ ఉంటుంది. ఓ నెల రోజుల్లో దశరథ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రం ప్రారంభమవుతుంది. ఈ రెండూ లవ్-ఫ్యామిలీ-యాక్షన్ ఉన్న చిత్రాలు. వీటి తర్వాత కె.రాఘవేంద్రరావు నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుంది.
?ఈ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు
-స్విట్జర్లాండ్ లో యూనిట్ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అభిమానులకు దూరంగా ఉండటం బాధగా ఉన్నా తప్పలేదు. షెడ్యూల్స్ అలా వచ్చాయి.
?అభిమానులకు ఏదైనా చెబుతారా
- నా కెరీర్ డలవప్ మెంట్ కు అభిమానులు ఎన్నో మంచి సలహాలు ఇస్తున్నారు. నా సక్సెస్ ను నాకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నది వారే. నేను ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో ఉంచుకునే తీసుకుంటాను. అభిమానులు మెచ్చే చిత్రాలు చేయాలన్నదే నా లక్ష్యం. నా బర్త్ డే సందర్భంగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|