బర్త్ డే గిఫ్ట్ 'ఏక్ నిరంజన్'
'ఈశ్వర్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి 'రాఘవేంద్ర', 'వర్షం', 'ఛత్రపతి', 'చక్రం', 'అడవిరాముడు', 'పౌర్ణమి', 'యోగి', 'మున్నా', 'బుజ్జిగాడు', 'బిల్లా' చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈనెల 29న 'ఏక్ నిరంజన్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్ లో కరుణాకరన్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అక్కడ్నించే ప్రభాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ముచ్చట్లలోకి వెళితే...
?గత పుట్టినరోజుకూ ఈ పుట్టినరోజుకూ మధ్య మీ కెరీర్ ఎలా ఉంది
- గత పుట్టినరోజున 'బిల్లా' ప్రారంభమైంది. ఈ పుట్టినరోజున కరుణాకరన్ దర్శకత్వంలో 'ఛత్రపతి' ప్రసాద్ తీస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాను. ఈ మధ్యలో 'బిల్లా' విడుదలై మంచి సక్సెస్ కావడం ఆనందం కలిగించింది. చాలా గ్యాప్ తర్వాత గోపీకృష్ణ బ్యానర్ లో తీసిన 'బిల్లా' హిట్ కావడం వెరీ వెరీ హ్యాపీ. ఈ బర్త్ డే గిప్ట్ గా 'ఏక్ నిరంజన్' రిలీజవుతోంది.
?'ఏక్ నిరంజన్'లో మిమ్మల్ని బాగా స్పందింప చేసిన పాయింట్
- హీరో క్యారెక్టర్. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ చూడని క్యారెక్టర్ ఇది. ఈ తరహా పాత్ర మన ఇండియన్ సినిమాల్లో ఇదే ఫస్ట్. చూడ్డానికి రఫ్ గా కనిపించే ఈ క్యారెక్టర్ లో అండర్ కరెంట్ గా ఓ ఫీల్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చేసింది. నాకు ఆర్టిస్టుగా మంచి తృప్తి కలిగించిన పాత్ర ఇది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|