'జయీభవ' సంతృప్తినిచ్చింది..
? సినిమాలో ప్రేక్షకులకు నచ్చిన అంశాల గురించి...
- ఇందులో నవరసాలూ ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ ట్రాక్ కు థియేటర్లలో అద్భుతమైన స్పందన వస్తోంది. పాటలన్నీ వేటికవే వైవిధ్యంగా ఉండటంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు నరేన్ కు ఇది తొలి చిత్రమైనప్పటికీ బాగా హ్యాండిల్ చేశారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.
?మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది.
-నాన్నగారితో పాటు, బాబాయ్ బాలకృష్ణ సినిమా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. నా నటనను అభినందించారు.
? పాత్రల ఎంపికలో ఎలాంటి ప్లానింగ్ అనుకుంటున్నారు
- రొటీన్ పాత్రలకు భిన్నంగా వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకూడదని నా అభిప్రాయం. ప్రేక్షకాభిమానులు కూడా ఇలాంటి సూచనలే ఇస్తున్నారు.
? తదుపరి చిత్రం ఏ బ్యానర్ లో ఉంటుంది
- సొంత బ్యానరా, బయట బ్యానరా అనేది ఇంకా అనుకోలేదు. ఇంతకుముందు బయట బ్యానర్లలో మూడు చిత్రాలు చేశాను. ఇప్పుడు కూడా రెడీనే. తదుపరి చిత్రం మాత్రం కమర్షియల్, సెంటిమెంట్ అంశాల సమ్మేళనంతో ఉంటుందని చెప్పగలను. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2
|