? దర్శకుడు జయరవీంద్ర గురించి...
- పుష్కలమైన టాలెంట్ ఉంది. గతంలో నేను కెమెరా డిపార్ట్ మెంట్ లో ఉన్నాను. అప్పట్నించీ ఆయనతో నాకు పరిచయమముంది. 'బంపర్ ఆఫర్' కోసం మంచి పనితనం చూపించారు.
? సంగీతం ఏవిధంగా ఈ చిత్రానికి తోడ్పడింది.
- ఈ సినిమా విజయంలో ఎక్కువ పాత్ర సంగీతానికి ఉంది. రఘు కుంచెతో పన్నెండేళ్లుగా నాకు పరిచయముంది. చాలా కసిగా ఆయన సంగీతం అందించారు. ముఖ్యంగా 'రవణమ్మ' పాటకు వస్తున్న రెస్పాన్స్ ఇంతా అంతా కాదు.
? ఈ సక్సెస్ తో అన్నయ్య పూరీ జగన్నాథ్ కోరిక నేరవేరినట్టేనా
- నిశ్చయంగా. నాకు చాలా కాలంగా ఓ సక్సెస్ ఇవ్వాలని అన్నయ్య తపించాడు. అలాంటి సక్సెస్ ను ఇప్పుడు 'బంపర్ ఆఫర్'తో ఇచ్చారు.
? ఈ సినిమా తర్వాత
- వైవిధ్యంగా ఉండే లవ్ ఎంటర్ టైనర్స్ చేయాలనుకుంటున్నాను.