'కుర్రాడు' అలరిస్తాడు: వరుణ్
?కో ఆర్టిస్టుల గురించి...
- హీరోయిన్ నేహాశర్మకు ఇది రెండో చిత్రం. పక్కింటి అమ్మాయి తరహాలో ట్రెడిషనల్ గా ఆమె పాత్ర ఉంటుంది. రవిశంకర్, నవీన్ విలన్లుగా నటించారు. అలాగా ఎమ్మెస్ నారాయణ, 'మున్నా' వేణు పాత్రలు కూడా బాగా అలరిస్తాయి. నాకు తండ్రిగా తనికెళ్ల భరణి నటించారు. ఇద్దరి మధ్యా చక్కటి ఎమోషన్స్ తో కూడిన సన్నివేశాలు ఉంటాయి.
?సినిమాలోని హైలైట్స్ గురించి...
- నిర్మాణ విలువలు, అచ్చు సంగీతం, సర్వేష్ మురారి ఫోటోగ్రఫీ, సందీప్ గుణ్ణం దర్శకత్వ ప్రతిభ వంటి హైలైట్స్ చాలానే ఉన్నాయి. రెండు ఫైట్స్ కూడా ఉన్నాయి. సహజత్వానికి చాలా దగ్గరగా ఈ ఫైట్స్ ఉంటాయి. సినిమాలోని 'ఏమంటారు' అనే పాట ఇప్పుటికే అందిరి నోళ్లలోనూ బాగా నానుతోంది. ప్రేక్షకులు కూడా సినిమాను బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
?కొత్తగా చేస్తున్న సినిమాలు
- ఓషియన్స్ ఫిలింస్ చిత్రంలోనూ, దిల్ రాజు తీస్తున్న 'మరోచరిత్ర'లోనూ నటిస్తున్నాను.

Be first to comment on this News / Article!
Pages: -1- 2
|