13న 'పదహారేళ్ల వయసు'
'పదహారేళ్ల వయసు' సినిమా పేరు చెప్పగానే మూడు దశాబ్దాల క్రితం శ్రీదేవి-చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రమే గుర్తుకువస్తుంది. తాజాగా 'పదహారేళ్ల వయసు' పేరుతో మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఈనెల 13న విడుదలకు సిద్ధమైంది. శ్రీ సూర్య దర్శకత్వంలో కిలారి హరిప్రసాద్, యడవల్లి నర్సింగరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
యూత్ కు పదహారేళ్ల వయసు నేది కత్తి అంచున నడక లాంటిదనీ, అప్పుడు మనసు ఏమాత్రం అదుపు తప్పినా అది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందనీ, ఆ వయసులో యువత మనోభావాలు ఎలా ఉంటాయే చెప్పే చిత్రమిదనీ దర్శకుడు సూర్య తెలిపారు. ప్రేమ అనేది అవసరమా? లేకుండా అది ఆకర్షణా? అనే విషయాన్ని ఇందులో చర్చించామనీ, సకుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదనీ అన్నారు. స్వర్గీయ నాగభూషణం మనువడు భూషణ్, ఆర్యవోరా జంటగా నటించిన ఈ చిత్రంలో ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్, వేణుమధవ్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించారు. భాషాచంద్ సినిమాటోగ్రఫీ, బద్రి ఎడిటింగ్, రాజ్ కిరణ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|