వర్మ 'రక్త చరిత్ర' - ప్రత్యేకం
-'రక్తచరిత్ర' లోని కొత్తదనం ఏమిటంటే...ఈ సినిమాని నా జీవితంలో మొట్టమొదటి సారిగా దాని పాత్రల మానసిక స్థితులు, నిజ జీవితంలో వారు పొందిన భావోద్వేగాలను ఆపారంగా గౌరవిస్తూ రూపొందిస్తున్నాను. ఇది కేవలం రవి, సూరిల మధ్య జరిగిన పోరు సారాంసం మాత్రమే కాదు. వాళ్ల కోసం హత్యలు చేసిన, వాళ్ల వలన హత్యలకి గురయిన వాళ్ల కథలు కూడా ఇందులో ఉంటాయి.
-రవి, సూరిలకు సన్నిహితుడైన ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా కలిసినప్పుడు వాళ్లను గురించి నాకు తెలిసిన కొన్ని నిజాలను నేను నమ్మలేకపోయాను. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా, ఇలాంటి వైపరీత్యాలు జరుగుతాయా? అనిపించింది.
- ప్రపంచంలో ప్రతీ చోట ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచ పోరాటల స్కేలులో చాలా చిన్నదయినా, ఈ రాయలసీమ ఫ్యాక్షనిజంలో జరిగే ఆధిపత్య పోరు మాత్రం చాలా భిన్నంగా కనిపించింది నాకు. ఇక్కడ మనుషులు, వాళ్ల మధ్య బంధాలు, వాళ్ల పరిస్థితులు చుట్టూ జరుగుతున్న అత్యంత ఉద్వేగ భరితమైన డ్రామా నాకు చాలా స్ఫూర్తినిచ్చింది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3-
|