జెనీలియా 'కథ' 11న
'బొమ్మరిల్లు', 'ఢీ', 'రెడీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కథ'. ఇందులో టీచర్ పాత్రలో జెనీలియా నటించగా, ఆయనకు జోడిగా నూతన హీరో అరుణ్ అదిత్ నటించారు. శ్రీనివాస్ రాగ దర్శకుడు. జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈనెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో నిర్మాత గుణ్ణం గంగరాజు బుధవారంనాడు వెల్లడించారు.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, యు/ఎ సర్టిఫికెట్ లభించిందనీ ఆయన తెలిపారు. సస్పెన్స్ తో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇదని చెప్పారు. ఓ అమ్మాయి, అబ్బాయికి సంబంధించిన రెగ్యులర్ ప్రేమకథే అయినప్పటికీ థ్రిల్లర్ అంశం చాలా వైవిధ్యంగా ఉంటుందన్నారు. జెనీలియా పలు షేడ్స్ లో ఉన్న పాత్రను పోషించారనీ, పైకి నవ్వుతూ కనిపించినా లోలోపల ఏదో దిగమింగుకుని ఉండేలా ఆమె పాత్ర ఉంటుందన్నారు. అరకులో కథ మొదలైనట్టు కనిపించినా అసలు కథ రెండు సంవత్సరాలకు ముందు జార్ఖండ్ లో ఆరంభమవుతుందనీ, అదేమిటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందేననీ చెప్పారు. ప్రకాష్ రాజ్ వైవిధ్యమైన పాత్ర ఇందులో పోషించారనీ, అలాగే ఎస్.కె.బాలచంద్రన్ కు సంగీత దర్శకుడిగా మనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘుబాబు, షిఫి తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|