శ్రియ రేటు పాతికే!
అందాల నటి శ్రియ ఇప్పుడు తన సామ్రాజాన్ని మలయాళ పరిశ్రమకు కూడా విస్తరించింది. తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాలతో పాటు ఓ రెండు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిన శ్రియ ఇంతవరకూ మలయాళ చిత్రాల్లో నటించలేదు. ఆ లోటును కూడా భర్తీ చేస్తూ తాజాగా 'పోక్కిరి రాజా' అనే మలయాళ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, పృధ్వీరాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు శ్రియ తన రెమ్యునరేషన్ ను బాగా తగ్గించుకోవడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఒక్కో చిత్రానికి 75 లక్షలు వరకూ వసూలు చేస్తున్న శ్రియ ఈ చిత్రం కోసం కేవలం 25 లక్షలు అందుకుంటోంది. నిజానికి ఈ పారితోషికం చీప్ గానే అనిపించినా, మలయాళంలో మాత్రం పెద్ద మొత్తమే. కేరళలో ఏ హీరోయిన్ కూ ఇంతవరకూ ఇవ్వని అమౌంట్ ఇది.
మలయాళ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని శ్రియ ధ్రువీకరించింది. మమ్ముట్టి, పృధ్వీరాజ్ తో కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నాననీ, తన పాత్ర చుట్టూనే సినిమా నడుస్తుందనీ, మలయాళంలో అడుగుపెట్టేందుకు తనకు దొరికిన మంచి అవకాశం ఇదనీ చెప్పుకొచ్చింది. ఇందుకోసం జనవరి 10 నుంచి ఫ్రిబ్రవరి 15వ తేదీ వరకూ శ్రియ డేట్లు ఇచ్చింది. ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ కానుంది. దీనికితోడు తమిళంలోనూ పలు చిత్రాల్లో శ్రియ నటిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'జగ్గుబాయ్', 'కుట్టీ' చిత్రాలు జనవరిలో రిలీజ్ కు సిద్ధమవుతుండగా, ఆర్య సరసన 'చిక్కు బుక్కు' అనే చిత్రం ప్రోగ్రస్ లో ఉంది. జీవా సరసన గోకుల్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ భారీ బడ్జెట్ చిత్రం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే శ్రీకాంత్ తో ఓ చిత్రానికి కమిట్ అయినట్టు వస్తున్న వార్తలను శ్రియ తోసిపుచ్చింది. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే ఏ కొత్త చిత్రానికి కమిట్ కాలేదని తేల్చిచెప్పింది.
Be first to comment on this News / Article!
|