రానాతో 'బొబ్బిలిరాజా 2'
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్ తర్వాత హీరోగా పరిచయమవుతున్న రానా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెట్టిన రానా తొలిసారి 'లీడర్' చిత్రం ద్వారా కథానాయకుడుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డాక్టర్ డి.రామానాయుడు మనువడు, సురేష్ బాబు తనయుడు అయిన రాణా నటన, క్రమశిక్షణలో తనకు చిన్నాన్న, తాతగారు ఆదర్శమని చెబుతున్నారు. తొలి చిత్రమే ఎవిఎం ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ లో, అందులోనూ శేఖర్ కమ్ముల వంటి సంచలన దర్శకుడి చిత్రంలో నటిస్తుండటంతో 'లీడర్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తర్వాత రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కొత్త చిత్రం నిర్మించేందుకు రామానాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఆసక్తికరంగా ఇది వెంకటేష్ నటించిన 'బొబ్బిలిరాజు' కు సీక్వెల్ కావచ్చని తెలుస్తోంది.
వెంకటేష్ కథానాయకుడుగా బి.గోపాల్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 1990లో రూపొందించిన 'బొబ్బిలిరాజా' అప్పట్లో సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ బ్యూటీ దివ్వభారతి ఈ చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం 3 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకొంది. వెంకటేష్ కెరీర్ ను 'బొబ్బిలిరాజా' మలుపుతిప్పినట్టే రానాతో ఈ చిత్రం సీక్వెల్ తీస్తే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని రామానాయుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 'లీడర్' చిత్రం రాబట్టే రిజల్ట్ చూసిన తర్వాత ఈ చిత్రం కార్యరూపంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈనెలాఖరులో కానీ జనవరిలో తొలి రిలీజ్ గా కానీ 'లీడర్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Be first to comment on this News / Article!
|