25న థియేటర్లలో 'కాస్కో'
వైభవ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా కె.ఫిలింస్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి సమర్పణలో రూపొందిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కాస్కో'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.భారతి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేయనున్నట్టు కోదండరామిరెడ్డి తెలిపారు.
వైభవ్ కు ఈ చిత్రం హీరోగా మంచి బ్రేక్ ఇస్తుందనీ, అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయనీ ఆయన తెలిపారు. దర్శకుడు మంచి కథ అందించడంతో పాటు అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. గోపీ మోహన్ స్క్రీన్ ప్లే, రవి మాటలు హైలైట్ అవుతాయన్నారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోందనీ, సినిమా కూడా చక్కటి విజయం సాధిస్తుందని అనుకుంటున్నామనీ పేర్కొన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డి సంస్థలో పనిచేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పారు. లవ్, యాక్షన్ తో మిళితమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదన్నారు. వైభవ్ నటనతో పాటు ఫైట్స్ లో కూడా చక్కటి ప్రతిభా పాటవాలు కనబరచారని చెప్పారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పూర్తి స్థాయి కామెడీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో గౌరీ పండిట్, జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్థి, సలీం పండా, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రఘబాబు, శ్రావాణ్ తదితరులు నటించారు. కె.రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఎడిటింగ్, సెల్వ-గణేష్ ఫైట్స్, ప్రేమ్ జీ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|