జనవరి 1న 'ఇంకోసారి'
కొత్త సంవత్సరం తొలి రోజున 'ఇంకోసారి' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాజా, రిచా, మంజరి ఫడ్నిస్, రవి వర్మ, సందీప్ ప్రధాన పాత్రల్లో బే మూవీస్ పతాకంపై కల్యాణ్ పల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమన్ పాతూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
కళాశాల విడిచిపెట్టిన ఏడేళ్ల తర్వాత కలిగిన ఓ మిత్ర బృందం చుట్టూ తిరిగే కథ ఇదనీ, ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుందనీ నిర్మాత కల్యాణ్ పల్ల తెలిపారు. మహేష్ శంకర్ అందించిన సంగీతం ఆడియో పరంగా మంచి ఆదరణ చూరగొంటోందన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా దక్కాయనీ, క్లీన్ యు సర్టిఫెకెట్ వచ్చిందనీ చెప్పారు. కొత్త సంవత్సరం తొలిరోజు సినిమా విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. జరిగిపోయిన జీవితం ఇంకోసారి మన ముంగిటకు వస్తే ఏం చేస్తామన్నదే ఈ చిత్రం కాన్సెప్ట్ అనీ, కేవలం 23 ఏళ్ల వయసులో సుమన్ పాతూరి ఈ చిత్రాన్ని వైవిధ్య భరితంగా మలిచారనీ హీరో రాజా ఇటీవల ప్రశంసించారు. 'ఆనంద్', 'వెన్నెల' చిత్రాల తర్వాత తాను ఇష్టపడే మూడో చిత్రమిదని అన్నారు. జనవరి 1న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
Be first to comment on this News / Article!
|