'పారానార్మల్ యాక్టివిటీ' 8న
పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన 'పారానార్మల్ యాక్టివిటీ' చిత్రం 'ఆర్' రేటెడ్ థ్రిల్లర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని జనవరి 8న ఆంధ్ర ప్రేక్షకులకు ఎస్వీఆర్ మీడియో ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తోంది. ఒరిన్ పిల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం విడుదలైన మొదటివారంలో 100 మిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ బిగ్ హిట్ థ్రిల్లర్ గా రికార్డు సృష్టించింది.
చిత్ర విశేషాలను పారామౌంట్ పిక్చర్స్ అధినేత బ్రాడ్ గ్రే వివరిస్తూ, ఈ చిత్రం చూడడానికి అభిమానులు పడే ఆరాటం తమకు చాలా థ్రిల్లింగ్ గా ఉందనీ, విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుంచి బాక్సాఫీస్ ను బద్దలుకొడుతూ ప్రపంచ సినీ చరిత్రలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించిందనీ అన్నారు. దర్శకుడు ఒరెన్ పెల్లికి ఈ చిత్రం తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఒక నూతన జంట ఇంట్లో అర్ధరాత్రి పూట జరిగే కొన్ని విచిత్ర సంఘటనల సమాహారమే ఈ చిత్రమనీ, సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఒక వింత అనుభూతిని కలిగించి చెరగని జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు.
Be first to comment on this News / Article!
|