మెయిన్ 'ఇడియట్' మహేష్?
హిందీ 'గజనీ' చిత్రం సాధించిన రికార్డులను కేవలం 4 రోజుల్లో తుత్తినియలు చేసిన '3 ఇడియట్స్' చిత్రం 100 కోట్ల గ్రాస్ రెవెన్యూ వసూలు చేసి ఇటీవల సంచలన రికార్డు సృష్టించింది. తాజాగా సరికొత్త కలెక్షన్ రికార్డులు నమోదు అవుతూ బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంటోంది. దీంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కోసం గట్టిపోటీ నెలకొంది. ఈ పోటీలో జెమినీ ఫిలిమ్ సర్క్యూట్స్ సంస్థ భారీ ఆఫర్ తో రీమేక్ హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం.
దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ గతంలో తీసిన రెండు చిత్రాల హక్కులను జెమినీ సంస్థ సొంతం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. హిరానీ తీసిన 'మున్నాభాయ్ ఎంబిబిఎస్', 'లగే రహో మున్నాభాయ్' చిత్రాలను తెలుగులో చిరంజీవి హీరోగా 'శంకర్ దాదా ఎంబిబిఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' గా తీశారు. మొదటి సినిమా సక్సెస్ కాగా, సీక్వెల్ ఫెయిలయింది. ఈ నేపథ్యంలో హిరానీ మూడో చిత్రమైన
'3 ఇడియట్స్' చిత్రం రీమేక్ హక్కులను 10 కోట్ల రూపాయలు చెల్లించి జెమినీ సంస్థ సొంతం చేసుకుందని సమాచారం. ఒరిజనల్ వెర్షన్ లో అమీర్, మాధవన్, షర్మాన్ జోషి ముగ్గురు ఇడియట్స్ గా నటించారు. తెలుగు వెర్షన్ లో అమీర్ పాత్రకు మరీ ముదురుగా ఉండే హీరో కాకుండా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోను ఎంపిక చేసేందుకు జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మహేష్ బాబును అప్రోచ్ కావాలని అనుకుంటున్నారట. మరో ఆప్షన్ గా పవన్ కల్యాణ్ పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. మెయిన్ 'ఇడియట్' ఎవరనే సస్పెన్స్ కు త్వరలోనే తెరపడనుంది.
Be first to comment on this News / Article!
|