తెలుగు హీరోలకు రెడ్ కార్పెట్!
రామ్ చరణ్ సైతం...
'చిరుత'గా తొలి అడుగు వేసి రెండో సినిమా 'మగధీర'తో తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించిన రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది. ప్రసిద్ధ రచయిత జావెద్ అక్తర్ తనయుడైన ఫర్హాన్ అక్తర్ ('రాక్ ఆన్' ఫేమ్) తన ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందించనున్న తదుపరి చిత్రానికి రామ్ చరణ్ తో అగ్రిమెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు కూడా ఆయన రామ్ చరణ్ కు వినిపించారనీ, దీనికి 'హాఫిస్' అనే టైటిల్ అనుకుంటున్నారనీ తెలుస్తోంది. ఇద్దరు మిత్రుల కథతో యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రం ఉండబోతోంది. ఎక్కువ భాగం ముంబైలో షూటింగ్ జరపాలనీ, ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది ఫర్హాన్ అక్తర్ ప్లానింగ్. దీపిక పడుకునే, కంగనా రనౌత్ లలో ఒకరిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. హీరోయిన్ తండ్రి పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారు.
అల్లరి నరేష్ తో యష్ రాజ్..
రానా, రామ్ చరణ్ నేరుగా బాలీవుడ్ లోకి అడుగుపెడుతుండగా, తన నవ్వులతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతున్న అల్లరి నరేష్ సైతం హిందీలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ దృష్టిలో పడ్డారు. ఆ సంస్థ ఇటీవల హిందీలో నిర్మించిన 'రాకెట్ సింగ్- సేల్స్ మన్ ఆఫ్ ది ఇయర్' చిత్రాన్ని తెలుగులో అల్లరి నరేష్ హీరోగా రీమేక్ చేసేందుకు పట్టుదలగా ఉంది. హిందీ వెర్షన్ రణ్ బీర్ కపూర్, షహజాన్ పదమ్సీ జంటగా షమిత్ అమిన్ దర్శకత్వంలో రూపొందింది. ఓవరాల్ గా....బాలీవుడ్ దర్శకనిర్మాతలు, అగ్ర సంస్థలు మునుపెన్నడూ లేని విధంగా తెలుగు హీరోలకు 'రెడ్ కార్పెట్' ఆహ్వానం పలుకుతుండటం ఇప్పుడు పరిశ్రమలోనూ ప్రధాన చర్చనీయాంశమవుతోంది. ఈ తాజా పరిణామాలు ఆయా సంస్థల మార్కెట్ విస్తరణ వ్యూహంలో ఓ భాగం కూడా కావచ్చు. కాదనలేం.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|