తెలుగు హీరోలకు రెడ్ కార్పెట్!
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమేనని అనుకునే రోజులు చెల్లిపోయాయి. ఇప్పటికే తెలుగులో సక్సెస్ అయిన పలు చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతూ కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్నాయి. అసలు రీమేక్ చేయడం కంటే నేరుగా యువ హీరోలను బాలీవుడ్ కు లిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖుల మెదళ్లను తొలిచేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పలువురు యంగ్ హీరోలు బాలీవుడ్ బాట పట్టబోతున్నారు. 'ప్రాంతీయ' ఆందోళనలతో తెలుగు పరిశ్రమ 'డివైడ్' కానుందనీ, చైన్నైకి తరలిపోనుందనీ అపోహలు తలెత్తిన నేపథ్యంలో తెలుగు హీరోలకు బాలీవుడ్ నుంచి 'రెడ్ కార్పెట్' ఆహ్వానాలు రావడం విశేషం. ఇది యాదృచ్ఛికం కూడా కావచ్చు. రోజుకో తెలుగు హీరో బాలీవుడ్ ఎంట్రీకి అగ్రిమెంట్ చేసినట్టు వస్తున్న కథనాలు కూడా తెలుగు హీరోలు తమ పరిధిని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు విస్తరించుకునే ముమ్మర యత్నాల్లో ఉన్నట్టు విశిదమవుతుంది.
యువతరం హీరోగా ఇంకా బోణి కూడా కొట్టని దగ్గుబాటి రానాకు బాలీవుడ్ నుంచి ఇప్పటికే ఓ ఆఫర్ వచ్చి చేరింది. డాక్టర్ డి.రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు అయిన రానా ఈ నెలలోనే 'లీడర్'గా తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రానాలో మాస్ హీరోకు కావాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉండటం, ఆజానుబాహుడు కావడంతో హిందీ నిర్మాతల దృష్టి ఆయనపై వెంటనే పడింది. బాలీవుడ్ దర్శక నిర్మాత రోహన్ సిప్పీ ఈ మధ్యనే 'లీడర్' ప్రివ్యూ చూసి హిందీలో తాను నిర్మించతలపెట్టిన కొత్త చిత్రానికి అగ్రిమెంట్ చేసినట్టు భోగట్టా. గోవాలోని డ్రగ్ మాఫియా చుట్టూ నడిచే కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ తో పాటు రానా నటించబోతున్నారు. బచ్చన్ తో పాటు రానా పాత్రకు కూడా సమప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|