'ఓం శాంతి' 13న ఖరారు
నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితిశర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓం శాంతి' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'క్లీన్'యు సర్టిఫికెట్ పొందింది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ హౌస్ నుండి త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ బ్యానర్ పై సి.ధర్మరాజు సమర్పణలో శేషు ప్రియాంక చలసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 13న ఈ చిత్రాన్ని
విడుదల చేస్తున్నట్టు శేషు ప్రియాంక ప్రకటించారు.
'బాణం' చిత్రంలో అభిరుచిగల నిర్మాతగా పేరుతెచ్చుకున్న శేషు ప్రియాంకకు ఇది రెండవ చిత్రం. తమ తొలిచిత్రం తరహాలోనే వైవిధ్యమైన కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుందని ఆమె చెబుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఇతర పాత్రల్లో మురళీ మోహన్, రవి కాలే, రోహిత్ పాఠక్, రఘబాబు, సునీల్, సుమన్ శెట్టి, ప్రగతి, శివారెడ్డి, సారిక రామచంద్రరావు నటించారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ప్రకాష్ అందిస్తున్న ఈ చిత్రానికి నాగరాజు గంధం మాటలు, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, రామ్ లక్ష్మణ్ -జాని సెబాస్టియన్ ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|