'యుగానికి ఒక్కడు' 29న
కార్తి (హీరో సూర్య సోదరుడు) కథానాయకుడుగా డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ పతాకంపైన రూపొందిన ఫాంటసీ అడ్వెంచర్ 'యుగానికి ఒక్కడు'. ప్రముఖ దర్శకుడు శ్రీరాఘవ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో 'ఆయరత్తిల్ ఒరువన్' పేరుతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమైంది. ఈనెల 29న ఈ ద్విభిషా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర సమర్పకుడు ఆర్.రవీంద్రన్ తెలిపారు.
యాక్షన్ అడ్వెంచర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవ అద్భుతంగా మలిచారనీ, రెండున్నర సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమించి 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందిన చిత్రమిదనీ ఆయన తెలిపారు. జి.వి.ప్రకాష్ సమకూర్చిన పాటలు ఇటీవల సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలై చక్కటి ఆదరణ చూరగొంటున్నాయని తెలిపారు. నిర్మాతగా తనకు కూడా ఈ చిత్రం మంచి పేరు తెస్తుందనీ, ఈనెల 29న రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. రీమాసేన్, ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పార్తీబన్, ప్రతాప్ పోతాన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీరామకృష్ణ సంభాషణలు, భువన చంద్ర-అనంత్ శ్రీరామ్ పాటలు, రామ్ జీ సినిమాటోగ్రఫీ, కోలా భాస్కర్ ఎడిటిగ్, రాంబో రాజ్ కుమార్ ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|