భారీ కలెక్షన్ల 'నమో వెంకటేశ'
విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి విడుదలైన 'నమో వెంకటేశ' చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన...తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను శ్రీనువైట్లు హైద్రాబాద్ లో సోమవారంనాడు తెలియజేశారు.
ఓపినింగ్స్ అదుర్స్...
ఎంటర్ టైన్ మెంట్, లవ్, యాక్షన్ వంటి అన్ని అంశాలు మేళవించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఇంతాఅంతా కాదనీ ఆయన తెలిపారు. తమ అంచనాలకు మించి భారీ ఓపినింగ్స్ వచ్చినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా వైజాగ్, పశ్చిమ గోదావరి, సీడెడ్, నైజాం వంటి అన్ని ఏరియాల నుంచి చాలా మంచి కలెక్షన్లు వచ్చాయనీ, ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో 4 రోజులకు 78 లక్షల రూపాయలు షేర్ వచ్చిందన్నారు. వారం పూర్తయ్యే నాటికి 1 కోటి 8 లక్షలు వసూలు అవుతుందన్నారు.
హైలైట్స్
వెంకటేష్ క్యారెక్టర్, ఆయన పాత్రలోని పాజిటివ్ కోణం, మేనరిజం, బ్రహ్మానందం కామెడీ, త్రిష నటన వంటివి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా డింగ్ డాంగ్...నమో నమో వెంకటేశ పాటలకు అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు. సినిమా పెద్ద హిట్ కావడంతో ఆడియో అమ్మకాలు మరింత పెరిగాయని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|