భారీ కలెక్షన్ల 'నమో వెంకటేశ'
టైటిల్ అలా పుట్టింది...
వెంకటేష్ బాబుతో సినిమా చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉందనీ, ఆ కోరిక ఈ చిత్రంతో తీరిందనీ శ్రీనువైట్ల తెలిపారు. అప్పట్లో 'ఆనందం' సినిమా చూసి తనను ఆయన అభినందించారనీ, ఆ తర్వాత క్రమంలో ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకోవడం, అది నమో వెంకటేశతో కార్యరూపంలోకి రావడం జరిగిందన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లినప్పుడు టైటిల్ ఆలోచన వచ్చిందనీ, రామజోగయ్య శాస్త్రి ఆలోచనతోనే వెంకటేష్ కు మేనరిజం పెట్టామనీ, ఈ రెండింటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందనీ తెలిపారు.
మహేష్ బాబుతో...
'నమో వెంకటేశ' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పై తీసిన నిర్మాతలు తన మిత్రులనీ, ఇదే బ్యానర్ నుంచి తన తదుపరి చిత్రం కూడా ఉండబోతోందనీ శ్రీనువైట్ల తెలిపారు. మహేష్ బాబు ఇందులో హీరోగా నటిస్తారనీ, యాక్షన్ తో కూడిన ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|