'3 ఇడియట్స్' రీమేక్ ఫైట్?
అమీర్ ఖాన్ '3 ఇడియట్స్' చిత్రం విడుదలైన పది రోజుల్లోనే 200 కోట్లకు పైగా ఆర్జించి సరికొత్త రికార్డులను సృష్టించిన తరుణంలో దక్షిణాది భాషల్లో ఆ చిత్రం రీమేక్ కు గట్టిపోటీ నెలకొంది. రీమేక్ రైట్స్ కోసం రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ప్రధానంగా పోటీ పడటం, ఎవరి ఎత్తుగడలతో వారు ముందుకు వెళ్లడంతో ఆ రెండు సంస్థల మధ్య ఇప్పుడు 'ప్రచ్ఛన్న యుద్ధం' జరుగుతోందంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తాజా ప్రచారం జరుగుతోంది. ఆ రెండు నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్ కాగా, మరొకటి జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ గా చెబుతున్నారు.
అల్లు అరవింద్ ఇటీవల గీతా ఆర్ట్స్ బ్యానర్ పై హిందీ 'గజనీ' చిత్రాన్ని నిర్మించి కొత్త రికార్డులు సృష్టించారు. ఆ రికార్డులను మళ్లీ 'గజనీ' హీరో అమీర్ ఖాన్ '3 ఇడియట్స్'తో తిరగరాశారు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం ద్వారా దక్షిణాదిన అడుగు పెట్టాలని విధువినోద్ చోప్రా ప్లాన్ చేశారట. అయితే జెమినీ ఫిలిమ్ సర్క్యూట్స్ ఒకడుగు ముందుకు వేసి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ హక్కుల కోసం 10 కోట్ల రూపాయలు చోప్రాకు ఆఫర్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్త గీతా అర్ట్స్ కార్యాలయానికి చేరడంతో ఆ సంస్థ అగ్గిమీద గుగ్గిలమైందట. జెమినీ సంస్థ రీమేక్ రైట్స తో ఇప్పటికే తెలుగు వెర్షన్ కోసం పవన్ కల్యాణ్ ను (అమీర్ పాత్రలో) సంప్రందించిందనీ, పవన్ కాదంటే మహేష్ ను అప్రోచ్ కావాలని అనుకుంటోందనీ బలమైన ప్రచారం కూడా కొద్దిరోజులుగా జరుగుతోంది. ఆసక్తికరంగా...ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరో కొత్త ప్రచారం కూడా బయటకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ రైట్స్ దక్కించుకుని వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో సినిమా రీమేక్ కు ప్లాన్ చేస్తోందట. మొత్తానికి సదరు సంస్థల్లో ఏదో ఒకటి అధికారికంగా ప్రకటిస్తే కానీ రీమేక్ రైట్స్ ఎవరికి దక్కాయనే సస్పెన్స్ కు తెరపడేలా లేదు.
Be first to comment on this News / Article!
|