ఐటెం బాంబ్ గా అనిత
అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసిరావాలి. 'నువ్వు నేను' చిత్రంలో హీరోయిన్ గా తెలుగులో తొలి హిట్ కొట్టిన అందాల నటి అనిత ఆ తర్వాత 'నేను పెళ్లికి రెడీ', 'నిన్నే ఇష్టపడ్డాను', 'తొట్టిగ్యాంగ్', 'శ్రీరామ్' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. దీంతో బాలీవుడ్ జర్నీ చేసి బాలాజీ టెలిఫిలిమ్స్ తో ఉన్న అనుబంధం కారణంగా అక్కడే కొద్దికాలంగా తన అదృష్టం పరీక్షించుకుంటోంది అప్పట్లో 'కుచ్ తో హై' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసి ఆ తర్వాత ఏక్తాకపూర్ మెగా సీరియల్ 'కావ్యాంజలి'తో అనిత పాపులర్ అయింది. ఏక్తాకపూర్ సలహా మీద తన పేరు నటషాగా కూడా మార్చుకుంది. తెలుగు మాత్రం చివరిసారిగా నాగార్జున 'నేనున్నాను' చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. తాజాగా అనిత మళ్లీ టాలీవుడ్ కు తిరిగొచ్చింది. అయితే ఈసారి హీరోయిన్ గా కాకుండా ఓ ఐటెం సాంగ్ లో నర్తిస్తోంది.
నిఖిల్, శ్వేతబసుప్రసాద్ జంటగా ఎల్.సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కళవర్ కింగ్' చిత్రంలో ఆమె ఓ స్పైసీ ఐటెం సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. ఐటెం సాంగ్స్ తో తెలుగులో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న అనిత మళ్లీ బిజీ అవుతాననే ఆశాభావంతో ఉంది. అవకాశాలు తగ్గాయని ఇంట్లో కూర్చోకుండా ఎప్పుడూ అందుబాటులో ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయనేది గతంలో చాలా మంది తారల విషయంలో ప్రూవ్ అయింది. అనితకూ ఇది వర్తిస్తుందేమో చూడాలి. శివరాత్రి కానుకగా 'కళవర్ కింగ్' విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|