తమిళ ప్రభు తెలుగులో...
తమిళ స్టార్ ప్రభు గణేషన్ (శివాజీ గణేశన్ కుమారుడు) ఇప్పుడు స్ట్రయిట్ చిత్రాలతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. తమిళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన ప్రభు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అయితే ఇంతవరకూ ఆయన అనువాద చిత్రాల ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'ఘర్షణ', 'కథానాయకుడు', 'మల్లన్న', 'చంద్రముఖి' వంటి అనువాద చిత్రాల్లో ప్రభు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఆయన రెండు స్ట్రయిట్ తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించేందుకు అంగీకరించడం విశేషం.
రామ్ చరణ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మిస్తున్న 'ఆరెంజ్', ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న 'డార్లింగ్' చిత్రాల్లో ప్రభు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండూ భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. వీటితో పాటు తమిళంలో సొంత బ్యానర్ శివాజీ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'అసల్' చిత్రంలో ప్రస్తుతం ప్రభు నటిస్తున్నారు. నటనకు ఆస్కారమున్న మంచి పాత్రలు లభించినప్పుడు కాల్షీట్లను బట్టి నటించేందుకు తనకు అభ్యంతరం లేదని ప్రభు చెబుతున్నారు.
Be first to comment on this News / Article!
|