నాగార్జున 'కేడి' ఫిబ్రవరి 12న
నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం 'కేడి'. కిరణ్ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర నిర్మాణం పూర్తయింది. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
'కింగ్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాగార్జునతో తమ బ్యానర్ లో రూపొందిస్తున్న స్టైలిష్ కమర్షియల్ మూవీ ఇదనీ, ఇటీవలే విడుదలైన ఆడియోకి చాలా మంచి స్పందన వస్తోందనీ ఆయన తెలిపారు. తమ బ్యానర్ లో వస్తున్న మరో సూపర్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తుందనీ అన్నారు. నాగార్జున సరసన మమతా మోహన్ దాస్ నటించగా, అమెరికా అమ్మాయి లిండా మరో కీలక పాత్రను పోషించింది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ అంకుర్, 'బండిట్ క్వీన్' ఫేమ్ నిర్మల్ పాండే, 'లగాన్' ఫేమ్ అఖిలేంద్ర మిశ్రా, 'డాన్' విలన్ కెల్లీ డార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్దన్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం కిరణ్ అందించిన ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, చిన్నచరణ్-కృష్ణ చైతన్య పాటలు, సెల్వ ఫైట్స్, శ్రవణ్ ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|