ఛార్మి 'ఇందు' ఆడియో
ఆడపిల్లలను అభిమానంతో కాలేజీలకు పంపాలే తప్ప అనుమానంతో కాదనే ఇతివృత్తంతో తమిళంలో రూపొందిన ఓ చిత్రం 'ఇందు' పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి 'చంద్రముఖి' ఫేమ్ పి.వాసు దర్శకుడు. పబ్లిసిటీ రంగంలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న బి.బి.ఎస్. స్టూడియో తొలిసారిగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. విద్యాసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారంనాడు జరిగింది. సంగీత దర్శక త్రయం ఆర్.పి.పట్నాయక్, చక్రి, ఘంటాడి కృష్ణ ఆడియో సీడిని ఆవిష్కరించి తొలి ప్రతిని లక్ష్మీగణపతి ఫిలింస్ అధినేత సుబ్రహ్మణ్యంకు అందజేశారు. శరవణ మ్యూజిక్ ద్వారా ఆడియో విడులైంది.
చిత్ర నిర్మాణ మురారిశెట్టి లక్ష్మణ్ మాట్లాడుతూ, సరికొత్త కథ-కథనాలతో పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, మలేసియాలోని కాలేజీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ చెప్పారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే విధంగా ఛార్మి పాత్ర ఉంటుందన్నారు. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కావడం తనకెంతో సంతోషం కలిగించినట్టు మరో అతిథిగా పాల్గొన్న దర్శకురాలు బి.జయ తెలిపారు. బాబితో తమకు మంచి అనుబంధం ఉందనీ, ఆయన స్ట్రయిట్ చిత్రాల నిర్మాత కూడా కావాలని కోరుకుంటున్నామని ఆర్.పి.పట్నాయక్, చక్రి, ఘంటాడి కృష్ణ అన్నారు. దర్శకుడు మన్మోహన్, టిడిపి యూత్ నాయకుడు దీపక్, అపోలో జనరల్ మేనేజర్ యోగి తదితరులు పాల్గొని నిర్మాతకు శుభాక్షాంక్షలు తెలియజేశారు.
Be first to comment on this News / Article!
|