'టిక్ టిక్ టిక్' సెన్సార్
అడుగడుగునా థ్రిల్లింగ్ కలిగించే కథాంశంతో 'టిక్ టిక్ టిక్' చిత్రాన్ని రూపొందించినట్టు చిత్ర దర్శకుడు అరుణ్ కాంత్ తెలిపారు. కృష్ణ భగవాన్, వేణుమాధవ్, సైరాభాను, ప్రేమ, మధుమిత ప్రధాన తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్ పతాకంపై శ్రీమతి అరుణకుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
తెలుగులో ఇంతవరకూ ఈ తరహా చిత్రం రాలేదనీ, సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఇదొక సరికొత్త చిత్రంగా అభినందించారనీ అరుణ్ కాంత్ తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో ఇదొక ట్రెండ్ సెట్టర్ అవుతుందనే గట్టి నమ్మకం తనకుందన్నారు. ఇందులో ఓ ప్రముఖ నటుడు సస్పెన్స్ పాత్రలో నటించారనీ, అతనెవరనే సస్పెన్స్ వీడాలంటే సినిమా చూడాల్సిందేననీ అన్నారు. ఇటీవల కెనడాలో స్పెషల్ విజువల్ ఎఫెక్ట్ వర్క్ జరిపామని అన్నారు. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సీతారామరాజు మాటలు, రాంబాబు గోపాల పాటలు, ఎస్.డి.జాన్ సినిమాటోగ్రఫీ, కానూరి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|