మాధవన్ ప్రేయసి మమత!
'చెలి', '13 బి' వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో మాధవన్ 'రంగ్ దే బసంతి', 'గురు', '3 ఇడియట్స్' వంటి హిందీ చిత్రాలతో మరింత చేరువయ్యారు. తాజాగా ఆయన నటించిన 'గురు యన్ ఆళ్' చిత్రాన్ని 'ప్రేయసి' పేరుతో న్యూ డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత డి.బాలాజీ తెలుగులోకి అనువదిస్తున్నారు. సెల్వా ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మాధవన్ ప్రేయసిగా గ్లామర్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ నటించింది.
ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుకొంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత బాలాజీ మాట్లాడుతూ, కోట్లాది రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందిందనీ, తెలుగు ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉండటంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామనీ చెప్పారు. మాధవన్, మమత జంట కన్నుల పండువగా ఉంటుందనీ, అలాగే 'అరుంధతి', 'మగధీర' చిత్రాలకు అద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన సెంథిల్ కుమార్ ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా చిత్రీకరించారనీ తెలిపారు. అలాగే శ్రీకాంత దేవా సంగీత మరో హైలైట్ అవుతుందన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు చెప్పారు.ఈ చిత్రంలో అబ్బాస్, వివేక తదితరులు నటించారు. ఆర్.రాజశేఖర్ రెడ్డి సంభాషణలు అందించారు.
Be first to comment on this News / Article!
|