'సాధ్యం' ఆడియో విడుదల
జగపతిబాబు, ప్రియమణి జంటగా కార్తికేయ గోపాలకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న చిత్రం 'సాధ్యం'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం రాత్రి జరిగింది. బెల్లంకొండ సురేష్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని జగపతిబాబుకు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి తొలి క్యాసెట్ ను మరో అతిథిగా విచ్చేసిన లగడపాటి శ్రీధర్ కు అందించారు.
జగపతిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, దర్శకనిర్మాతలు చక్కటి ప్లానింగ్ తో సినిమా తీశారనీ, ఏ దశలోనూ ఈ సినిమా ఎందుకు చేస్తున్నామా అనే అభిప్రాయం తనకు కలగలేదనీ అన్నారు. మళ్లీ ఇదే బ్యానర్ లో ఇంకో చిత్రం ఎప్పుడు చేద్దామా అని ఉందని అన్నారు. ప్రియమణి ఈ చిత్రంతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందనీ, అలాగే ఈ సినిమాకు పనిచేసిన గీతరచయితలు, గాయనీగాయకులకు నూతన సంగీత దర్శకుడు చిన్నికరణ్ సముచిత రీతిలో స్థానం కల్పించడం అభినందనీయమనీ అన్నారు. ఇందులో తన పాత్ర గురించి చెప్పగానే వెంటనే అంగీకరించినట్టు ప్రియమణి పేర్కొంది. సందర్భోచితమైన పాటలు ఇందులో ఉన్నాయన్నారు. జగపతిబాబు తనకంటూ ఒక ప్రత్యేకమై స్టయిల్ తో గుర్తింపు పొందారనీ, అలాగే నేటిట్రెండ్ కు తగ్గట్టుగా ఈ చిత్రం ట్రైలర్స్ ఉన్నారనీ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.'పెళ్లైన కొత్తలో' తరహాలో జగపతిబాబు-ప్రియమణి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని బెల్లంకొండ సురేష్ అభిలషించారు. గతంలో తాను తీసిన 'స్టైల్' చిత్రంలో చిన్నిచరణ్ 3 పాటలు రాశాడనీ, ఇప్పుడు ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయం కావడం సంతోషంగా ఉందనీ లగడపాటి శ్రీధర్ అన్నారు. ఆరేళ్లుగా పరిశ్రమలో ఉంటున్న తాను ఈ రోజు కోసమే ఎదురుచూస్తూ వచ్చాయని చిన్నిచరణ్ అన్నారు. మంచి యూనిట్ పనిచేస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని కార్తికాయ గోపాలకృష్ణ పేర్కొన్నారు. నిర్మాతలు కుమార్ బ్రదర్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జి.హరినాథ్, పాండురంగ, గీతరచయిత పావని మణిచంద్ర తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|