'అమాయకుడు' ఎవరి వాడు?
'వినాయకుడు', 'విలేజ్ లో వినాయకుడు' తర్వాత కృష్ణుడు కథానాయకుడుగా ఆక్టాగాన్ మూవీస్ పతాకంపై భారతీ గణేష్ దర్శకత్వంలో ఎం.బాలమురుగన్ నిర్మిస్తున్న వినోదాత్మక చిత్రం 'అమాయకుడు'. దీనికి 'వీడే నాయకుడు' అనే ట్యాగ్ లైన్ ఉంది. కృష్ణుడు సరసన అనన్య, పూనమ్ సింగార్, గీతాసింగ్ నాయికలు. ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంలో గండిపేటలోని ఓ ప్రైవేటు భవంతిలో చిత్రయూనిట్ ఆ విశేషాలను తెలియజేసింది.
ఈ చిత్రంలో మంచి కొడుకు, మంచి ప్రేమికుడు, మంచి మనిషిగా నటిస్తున్నాను. నేను ఒకమ్మాయిని ప్రేమిస్తాను. నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లు ఒక అమ్మాయిని చూస్తారు. చివరకి నేను ప్రేమించిన అమ్మాయిని ఎలా చేరుకున్నానన్నదే ఈ కథాంశం..అని కృష్ణుడు వివరించారు. కథానాయికల్లో ఒకరైన పూనమ్ సింగార్ మాట్లాడుతూ, ఇందులో చాలా మంచి పాత్ర పోషిస్తున్నాననీ, తనకు మంచి పేరు వస్తుందనీ చెప్పింది. కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం ఇదని నిర్మాత భారతీ గణేష్ పేర్కొన్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిందనీ, మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ తెలిపారు. ఈ చిత్రానికి ఘటికాచలం మాటలు అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|