'మిలే సుర్...' మహేష్
ప్రిన్స్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు కావస్తోంది. అయితే ఆఫ్ స్క్రీన్ ఆయన కనిపించినప్పుడల్లా అది సెన్సేషన్ అవుతూనే ఉంది. తాజాగా ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, దేశభక్తియుతమైన ప్రాజెక్ట్ లో కనిపించబోతున్నారు. రెండు దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా దూరదర్శన్ ద్వారా ప్రజలను ఉర్రూతలూగించిన బహుభాషా జాతీయ సమైక్య గీతం 'మిలే సుర్ మేరా తుమ్హారా' ఇప్పుడు 'ఫిర్ మిలే సుర్..గా' సరికొత్త రూపంలో ముందుకొస్తోంది. గణతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈ గీతం ప్రసారం కానుంది.
కొత్తగా చిత్రీకరణ జరుపుకొన్న ఈ గీతానికి పి.వైద్యనాథన్ తో పాటు సహ స్వరకర్తగా ఉన్న లూయీ బాంక్స్ స్వరకల్పన చేశారు. కైలాస్ సురేంద్రనాథ్ ఈ గీత చిత్రీకరణకు దర్శకత్వం హించారు. వివిధ భాషా చిత్రాలకు చెందిన ప్రముఖులతో తిరిగి చిత్రీకరించిన ఈ గీతానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మహేష్ బాబు లీడ్ చేయనుండటం విశేషం. ఆయనతో పాటు బ్యాండ్ మింటన్ క్రీడాకారులు గోపీచంద్, సైనా నెహ్వాల్ కూడా కనిపిస్తారు. ఈ గీతంలో కనిపించే ఇతర భాషా చిత్రాల ప్రముఖులలో అమితాబ్, షారూక్, సల్మాన్, ఐశ్వర్య, ఎ.ఆర్.రెహమాన్, శంకర్-ఎహసాన్-లాయ్, కె.జె.ఏసుదాస్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, అనౌష్కా శర్మ, సోను నిగమ్, రణ్ బీర్ కపూర్, షాహిద్ కపూర్, శిల్పా శెట్టి, శ్రేయా ఘోషల్ తదితరులు ఉన్నారు. ఈ గీతాన్ని బెనెట్, కోలమన్ సంస్థకు చెందిన 'జూమ్' ఛానల్ ముందుకు తెస్తుంది.
Be first to comment on this News / Article!
|