30న రంగుల 'మాయాబజార్'
విజయా వారి ఓల్ట్ క్లాసిక్ 'మాయాబజార్' ఇప్పుడు రంగుల్లోకి మారింది. సాంకేతిక విలువలు అంతగా లేని రోజుల్లోనే 'మాయాబజార్' చిత్రాన్ని ఓ అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దిన ఘనత చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణికి దక్కుతుంది. 1957లో నిర్మించిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ఇప్పుడు గోల్ట్ స్టోన్ టెక్నాలజీ సంస్థ రంగుల్లోకి మార్చింది. సూపర్ గుడ్ ఫిలింస్ ఈనెల 30న ఆంధ్రదేశమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సంకల్పిచింది. హైద్రాబాద్ లోని సూపర్ గుడ్ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు, గోలల్డ్ స్టోన్ టెక్నాలజీ ప్రతినిధులు ఈ వివరాలను తెలియజేశారు.
సూపర్ గుడ్ ప్రతినిధి వాకాడ అప్పారావు మాట్లాడుతూ, నవీన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని కలర్ లోకి మార్చినట్టు చెప్పారు. ఈ చిత్రం చూస్తుంటే నిజంగానే కలర్ లో షూటింగ్ చేసిన అనుభూతి కలుగుతుందని, కేవలం రంగుల విషయంలోనే కాకుండా శబ్దం విషయంలోనూ ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామని అన్నారు. రంగుల 'మాయాబజార్' ప్రేక్షకులను తప్పని సరిగా అలరిస్తుందనే నమ్మకం ఉందని మరో ప్రతినిధి ఎన్.వి.ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని కలర్ లో తీర్చిదిద్దేందుకు తాము ఎంతో శ్రమించినట్టు కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్ మోహన్ చెప్పారు. డాక్టర్ అక్కినేని ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంతోషాన్ని కలిగించినట్టు చెప్పారని, కేవలం రంగులు అద్దడమే కాకుండా సినిమా స్కోప్, డిటిఎస్ వంటి అత్యాధునిక హంగులు కూడా సమకూర్చినట్టు తెలిపారు. ఈ సమావేశంలో అంజన్, వెంటన్, శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|