రంభ నిశ్చితార్ధం నేడు
దక్షిణాదిన హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ఈమధ్యనే 'క్విక్ గన్ మురుగన్' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించిన గ్లామర్ నటి రంభ మరి కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటల మీద కూర్చోనుంది. దీనికి ముందుగా జరిగే వివాహ నిశ్చితార్ధం ఈ బుధవారమే చెన్నైలోని పార్క్ షెరటాన్ హోటల్ లో జరుగనుంది. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత మిత్రులు, బంధువులు ఇందులో పాల్గొంటారు. కెనడా వ్యాపారవేత్త ఇంద్రన్ తో రంభ నిశ్చితార్ధం జరుగుతుంది.
ఇంద్రన్ కు చెందిన 'మ్యాజిక్ వుడ్స్' సంస్థ సరికొత్త ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రంభ ఇటీవల పనిచేయడం, ఆయన స్వయంగా కోటిన్నర రూపాయల విలువ చేసే ఖరీదైన కారును ఆమె గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ఇంద్రన్ పెళ్లి ప్రతిపాదన చేయడం, ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. మార్చి 27న వివాహ ముహూర్తం కూడా నిశ్చయించినట్టు తెలుస్తోంది. వివాహానంతం రంభ సినీ కెరీర్ కు స్విస్తి చెప్పి తన భర్తతో కెనడాలో స్థిరపడే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|