రాజకీయాల్లోకి స్నేహ
సాంప్రదాయ చీరకట్టులో అభినయానికి ప్రాధాన్యమిచ్చే పాత్రల్లో కనిపించడం స్నేహ ప్రత్యేకత. ఆమె పేరు చెప్పగానే ఒక 'రాధాగోపాళం', మరో 'శ్రీరామదాసు' వంటి చిత్రాలు గుర్తొస్తాయి. యువతరం హీరోయిన్ల పోటీలో ఇటీవల కొద్దిగా వెనుకబడిన స్నేహ ఇప్పుడు ఇమేజ్ మార్చి 'భవాని ఐపిఎస్' అనే యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. 'కర్తవ్యం' చిత్రంలో విజయశాంతిని గుర్తు చేసే విధంగా ఆమె పాత్ర ఉండబోతోంది. మరి విజయశాంతి తరహాలోనే ఆమెకు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ఇదే ప్రశ్నను మీడియా సంధించినప్పుడు 'ఆ ఆలోచన ఉంది' అంటూ చిరునవ్వులు చిందించింది స్నేహ.
'ప్రస్తుతం కెరీర్, సినిమాలకే నా ప్రాధాన్యం. ఓ పదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి' అంటూ చెప్పుకొచ్చింది స్నేహ. పదేళ్ల వరకూ సినిమాల్లో ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తగిన ఆఫర్లు లేకపోకపోవడం వల్ల ఈ పదేళ్ల కెరీర్ ఏమిటనేది కొందరిని వేధిస్తున్న ప్రశ్న. అయితే రాజకీయాల్లోకి వస్తాననే ఫీలర్ వదలడం వల్ల మరికొన్ని సినిమాలు చేతిలో పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి స్నేహ నిర్ణయాన్ని మాత్రం స్వాగతిద్దాం.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|