సిద్దార్ధ 'స్ట్రైకర్' 5న
'రంగ్ దే బసంతి' చిత్రం ద్వారా హిందీ ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్ధ కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ హిందీలో నటిస్తున్న చిత్రం 'స్ట్రైకర్'. ఇందులో ఆయన సోలో హీరోగా నటిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ సమర్పణలో మేక్ ఫిల్మ్ ప్రొడక్షన్, స్టూడియో 18 సహనిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. చందన్ ఆరోరా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రాన్ని 'స్టైకర్' పేరుతోనే ఇంద్ర ఫిలిమ్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
ఎనభైయవ దశకాల నాటి పరిస్థితుల ఆధారంగా ముంబై నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో సిద్దార్ధ క్యారమ్స్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. ఆయనకు జోడిగా దక్షిణాది బ్యూటీ పద్మప్రియ, విద్య మల్వాడే నటించారు. ఆరుగురు ప్రముఖ సంగీత దర్శకులు ఈ చిత్రానికి సంగీతం అందించగా, శ్రీ నేపథ్య సంగీతం అందించారు. సిద్దార్ధ ఇందులో ఓ పాట కూడా పాడటం విశేషం. అనుపమ్ ఖేర్, ఆదిత్య పంచోలి, సీమ బిస్వాస్, 'అంకుర్' విశాల్ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|