'యుగానికి ఒక్కడు' వాయిదా
కార్తి (హీరో సూర్య సోదరుడు) కథానాయకుడుగా డ్రీమ్ వ్యాలీ పతాకంపై ఆర్.రవీంద్రన్ సమర్పణలో రూపొందిన ఫాంటసీ అడ్వంచెర్ 'యుగానికి ఒక్కడు'. ప్రముఖ దర్శకుడు శ్రీరాఘువ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. తమిళంలో 'ఆయరత్తిల్ ఒరువన్' పేరుతో ఈ చిత్రంలో పొంగల్ కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు వెర్షన్ ఈనెల 29న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తొలుత ప్రకటించినప్పటికీ కారణాంతరాల వల్ల ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
యాక్షన్ అడ్వంచెర్ గా దర్శకుడు రాఘువ అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారనీ, రెండున్నర సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమించి 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిందనీ రవీంద్రన్ తెలిపారు. జి.వి.ప్రకాష్ సమకూర్చిన పాటలు ఇప్పటికే సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలై మంచి ఆదరణ చూరగొంటున్నాయని అన్నారు. తమిళంలో ఇటీవల విడుదలైన చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోందనీ, తెలుగులోనూ మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు. రీమాసేన్, ఆండ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పార్తీబన్, ప్రతాప్ పోతన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామకృష్ణ సంభాషణలు, భువనచంద్ర-అనంత్ శ్రీరామ్ పాటలు, రామ్ జీ సినిమాటోగ్రఫీ, కోలా భాస్కర్ ఎడిటింగ్, రాంబో రాజ్ కుమార్ ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|