నాగ్ 'కేడి' రీరికార్డింగ్
'కింగ్' నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రం 'కేడి'. కిరణ్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకొంటోంది.
శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, నాగార్జునతో తమ బ్యానర్ లో తీసిన స్టయిలిష్ కమర్షియల్ ఫిలిం 'కేడి' అనీ, ఇటీవలే విడుదల చేసిన ఆడియోకి చాలా మంచి రెస్పాన్ వచ్చిందనీ చెప్పారు. తమ సంస్థ సిల్వర్ జూబ్లీ ఇయర్ లో వస్తున్న మరో సూపర్ హిట్ చిత్రమిదని అన్నారు. శివరాత్రి సందర్భంగా ఫ్రిబ్రవరి 12న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. నాగార్జున సరసన మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అమెరికా అమ్మాయి లిండా ఓ కీల పాత్ర పోషించింది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ అంకుర్, 'బండిట్ క్వీన్' ఫేమ్ నిర్మల్ పాండే, 'లగాన్' ఫేమ్ అఖిలేంద్ర మిశ్రా, 'డాన్' విలన్ కెల్లీడార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్దన్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం కిరణ్ అందించిన ఈ చిత్రానికి చిన్నిచరణ్-కృష్ణచైతన్ పాటలు, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, సెల్వ ఫైట్స్, శ్రవణ్ ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|