సి.ధర్మరాజు కన్నుమూత
ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తండ్రి సి.ధర్మరాజు శనివారం ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
వైజయంతీ మూవీస్ చిత్ర సమర్పకుడుగా సి.ధర్మరాజు పరిశ్రమలో అందరికీ సుపరిచితులు. 35 ఏళ్లుగా వైజయంతీ సంస్థను అగ్రపథంలో నిలపడంలో ఆయన కీలక భూమిక వహించారు. నేటి మధ్యాహ్నం ధర్మరాజు భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని నివాసంలో కొంత సేపు ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పిఆర్పి ఆధినేత చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ఎన్టీఆర్, కె.రాఘువేంద్రరావు, కె.ఎస్.రామారావు తదితరులు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ధర్మరాజు భౌతిక కాయాన్ని సాయంత్రం విజయవాడకు తరలించారు. అక్కడే ఆదివారంనాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Be first to comment on this News / Article!
|