సమ్మర్ లో 'మరోచరిత్ర'
వరుణ్ సందేశ్, అనిత జంటగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'మరోచరిత్ర'. రవియాదవ్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోందని దిల్ రాజు శనివారంనాడు సంస్థ కార్యాలయంలో తెలిపారు.
చక్కటి ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందిందనీ, మిక్కీ జె.మేయర్ చక్కటి సంగీతం అందించారనీ దిల్ రాజు తెలిపారు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఆడియో విడుదల చేసి, సమ్మర్ సెలవుల్లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, 'కొత్తబంగారులోకం' తర్వాత దిల్ రాజుతో పనిచేస్తుంటడం ఇది రెండో సారనీ, నేటి ట్రెండ్ కు అనుగుణంగా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్ర దర్శకుడు కెమెరామన్ కూడా కావడంతో చాలా అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఇందులో నటనకు అవకాశమున్న పాత్రను పోషించినట్టు శ్రద్ధాదాస్ పేర్కొంది. కె.బాలచందర్ 'మరోచరిత్ర'కు మోడ్రన్ వెర్షన్ గా, కొత్త కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు రవియాదవ్ తెలిపారు. క్లైమాక్స్ చాలా విభిన్నంగా ఉంటుందన్నారు. హైద్రాబాద్ , కెనడా, యుఎస్,. దుబాయ్, వైజాగ్ లలో షూటింగ్ జరిపినట్టు తెలిపారు. ఈ సమావేసంలో ఉమర్జీ అనూరాధ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు శిరీష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|