'అందరి బంధువయా' పాటలు
శర్వానంద్, పద్మప్రియ జంటగా చంద్రసిద్ధార్ధ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అందరి బంధువయా'. యుటోపియా ఎంటర్ టైనర్స్, ఫిల్మోత్సవ్ పతాకంపై ఆర్.కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆడియో క్యాసెట్ ను శ్రీనువైట్ల విడుదల చేయగా తొలి క్యాసెట్ ను తేజ కొనుగోలు చేశారు. ఆడియో సీడీని అల్లు అరవింద్ విడుదల చేయగా డి.రామానాయుడు కొనుగోలు చేశారు. వీడియో లోగోను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అనూప్ రూబెన్స్, తమ్మారెడ్డి భరద్వాజ, నరేష్, ఆర్.పి.పట్నాయక్, రాజా, పద్మప్రియ, బలభద్రపాత్రుని రమణి, చంద్రసిద్దార్ధ, లగడపాటి శ్రీధర్, కూచిపూడి వెంకట్, మాగంటి గోపీనాథ్, ఆర్.కె., శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధుర మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ, చంద్రసిద్దార్ధది ఒక ప్రత్యేక మైన స్కూల్ అనీ, తమ బ్యానర్ లో 'మధుమాసం' వంటి చక్కటి సినిమా చేశారనీ అన్నారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ,చంద్రసిద్దార్ధ చిన్న దర్శకులలో పెద్ద దర్శకుడనీ, చిన్న సినిమాల వల్లే పరిశ్రమలో చాలా మంది బతుకుతున్నారనీ, ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలనీ అన్నారు. చంద్రసిద్దార్ధ తన చిన్ననాటి మిత్రుడనీ, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 'ఆ నలుగురు' దర్శకుడుతో సినిమా తీయమని తన బంధవులు అడుగుతుంటారనీ, అలాంటి ప్రతిభావంతుడు చంద్రసిద్దార్ధ అనీ లగడిపాటి శ్రీధర్ అన్నారు. భలభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ, చంద్రసిద్దార్ధ తీసిన 'మధుమాసం' సినిమాకు కథ ఇచ్చాననీ, ఆ చిత్రానికి నంది అవార్డు వచ్చిందనీ అన్నారు. ఈ చిత్రానికి కూడా పాటలు, సంగీతం చక్కగా కుదిరాయనీ, మంచి విజయం వరిస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు. చంద్రసిద్దార్ధ మాట్లాడుతూ, రమణిగారు ఈ కథ చెప్పగానే మంచి సినిమా తీయొచ్చని అనిపించిందనీ, అలాగే అనూప్ రూబెన్స్ అందించిన పాటలు వినగానే సినిమా చూడాలనిపిస్తుందనీ అన్నారు. తాను దర్శకుడు కాకమునుపే ఆర్.కె.తో మంచి పరిచయం ఉందనీ, అప్పుడే ఒక సినిమా చేద్దామని ఆయన అన్నారనీ చెప్పారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని రాజా, పద్మప్రియ, ఆర్.పి.పట్నాయక్ తదితరులు అభిలషించారు.
Be first to comment on this News / Article!
|