ఇవివి కొట్టిస్తున్న 'బురిడీ'
'బెండు అప్పారావు ఆర్ఎంపి' సక్సెస్ తర్వాత దర్శకుడు ఇవివి సత్యనారాయణ తాజాగా రూపొందుస్తున్న మరో హాస్యభరిత చిత్రం 'బురిడి'. దీనికి 'తెగ నవ్వించేత్తాడు' అనే ఉపశీర్షిక ఉంది. ఇవివి 50వ చిత్రమిది. బిగ్ బి ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందుతోంది. ఆర్యన్ రాజేష్, ఐశ్వర్ (తొలి పరిచయం) జంటగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 1న ప్రారంభమై రామోజీ ఫిలింసిటీలోని వివిధ లొకేషన్లలో తొలి షెడ్యూల్ జరుపుకొంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకాక్ లో చిత్రీకరణ మొదలైంది.
పరిశ్రమలోని కమెడియన్లంతా ఇందులో నటిస్తున్నారనీ, ఆద్యంతం హాస్యభరితంగా ఈ చిత్రం ఉంటుందనీ ఇవివి తెలిపారు. ఇప్పటి వరకూ జయప్రకాష్ రెడ్డి-శకుంతల, కృష్ణభగవాన్-కల్పన, ఆలీ-లావణ్య జ్యోత్స్న, ఎల్బీశ్రీరామ్-సురేఖ వాణి, సుమన్ శెట్టి-హేమ, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, కళ్లు చిదంబరంలపై కొన్ని సన్నివేశాలు తీసినట్టు ఆయన చెప్పారు. ఇవివి ఇప్పటి వరకూ తీసిన కామెడీ చిత్రాల్లో ఇది 'ది బెస్ట్'గా నిలుస్తుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఈదర రవికుమార్ తెలిపారు. ఈడ్పుగంటి సుబ్రమణ్యేశ్వరరావు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|