పద్మప్రియ బాలీవుడ్ 'స్ట్రైకర్'
తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన సిద్దార్ధ ఇప్పుడు 'స్ట్రైకర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'రంగ్ దే బసంతి'చిత్రం తర్వాత సిద్దార్ధ హిందీలో నటించిన రెండో చిత్రమిది. తెలుగులోనూ ఇదే పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో దక్షిణాది ముద్దుగుమ్మ పద్మప్రియ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. 'శీను వాసంతి లక్ష్మి' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన పద్మప్రియ ఆ తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో నటించింది. తొలిసారి ఆమె 'స్ట్రైకర్' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.
ఇందులో తాను మధు అనే అమ్మాయిగా చాలా మంచి పాత్ర పోషించానని పద్మప్రియ తెలిపారు. షూటింగ్ చేస్తున్నప్పుడు భాష అనేది తనకు సమస్య కాలేదనీ, మధ్యాహ్నం రెండు గంటలకు షూటింగ్ ప్రారంభించి ఉదయం నాలుగు గంటలకు వరకూ చేసేవాళ్లమనీ పేర్కొంది. ఒక మంచి టీమ్ తో కలిసి పనిచేసిన ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రంలో క్యారమ్స్ ప్లేయర్ గా సిద్దార్ధ నటించారు. చందన్ ఆరోరా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ లో హిందీ, తెలుగు భాషల్లో ఇంద్ర ఫిల్మ్స్ ఈ నెల 5న రిలీజ్ చేస్తోంది.
Be first to comment on this News / Article!
|