లతకు ఎఎన్నార్ అవార్డు
సినీ రంగంలో అత్యున్నత స్థానం పొందిన అక్కినేని నాగేశ్వరరావు అదే రంగంలో ఖ్యాతి గడించిన లతా మంగేష్కర్ కు అవార్డు ఇవ్వడం గర్వకారణమని రోశయ్య పేర్కొన్నారు. ఆమెకు ఇచ్చిన అవార్డుతో అక్కినేని అవార్డు విలువ మరింత పెరిగిందన్నారు. ఇదే వేదిక నుంచి సైక్లోన్ రిలీఫ్ ఫండ్ గా 5 కోట్లు ప్రకటించడం, మన్నవరం దగ్గర ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు సంబంధించి కేంద్ర మంత్రి చేసిన ప్రకటన తమకెంతో సంతోషం కలిగిస్తోందన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ, లతా మంగేష్కర్ గురించి ఎంత మాట్లాడినా మాటలు చాలవని ప్రశంసించారు. భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం అందుకున్న లత ప్రపంచరత్న అందుకునేంత గొప్ప వ్యక్తి అని అన్నారు. తాను నటించిన 'దేవదాసు' సినిమా పది సార్లు చూశాననీ, అక్కినేని అంటే తనకు అభిమానమనీ లత చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఒక నటుడిగా ఈ వయసులో తనకు ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదన్నారు. తన వయసు మరో 10 సంవత్సరాలు పెరిగనట్టయిందని నవ్వుతూ చెప్పారు. ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆ అవార్డును తన తర్వాత కూడా తన వారసులైన వెంకట్, నాగార్జున కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. లతా మగేంష్కర్ పాడిన పాటలు వింటూ తాము పెరిగామని అక్కినేని వెంకట్ అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|