మేలో అల్లు అర్జున్ పెళ్లి?
ఇది టాలీవుడ్ లో ఎలిబిబుల్ బ్యాచిలర్ల పెళ్లిళ్ల సీజన్ లా ఉంది. ఇటీవలే నటి రంభకు లండన్ కు చెందిన పారిశ్రామిక వేత్త ఇంద్రన్ తో నిశ్చితార్ధం జరిగింది. వచ్చే మార్చిలో తిరుపతిలో ఆమె పెళ్లి పీటల మీద కూర్చోనుంది. ఆ వెనువెంటనే యువ హీరో ఎన్టీఆర్ పెళ్లి ఉండబోతోంది. నార్నే కుటుంబానికి చెందిన లక్ష్మీప్రణతితో ఎన్టీఆర్ వివాహం నిశ్చయమైంది. మార్చి ద్వితీయార్థంలో నిశ్చితార్ధం జరుగుతుంది. మే 21న వివాహ ముహూర్తం అనుకుంటున్నారు. ఇదే రోజు పెద్ద ఎన్టీఆర్ వివాహం జరిగింది. ఈ దశాబ్దంలోనో కనీవినీ ఎరుగుని రీతిలో 50 నుంచి 100 కోట్ల ఖర్చుతో వైభవంగా ఈ వివాహం జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఎలిజిబుల్ బ్యాచిలర్ , స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మేలో పెళ్లి చేసుకోనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
అల్లు అర్జున్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా మేలో పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయనీ, అది కూడా తన మనసుకు నచ్చిన అమ్మాయితోనే ఉండబోతోందనీ ప్రచారం జరుగుతోంది. వధువు పరిశ్రమకు చెందిన అమ్మాయి మాత్రం కాదని వారంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు 'వరుడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో 'వధువు' ఎవరనే చర్చ సహజమేననీ, ఇప్పటి వార్తలు కూడా అలాంటివే కావచ్చనీ వారంటున్నారు. అయితే 'బన్నీ' (ముద్దుపేరు) ఏ అమ్మాయిని ఇష్టపడినా కళ్లు మూసుకుని పెళ్లికి ఒప్పుకుంటామనీ, కాకపోతే తమ ఫ్యామిలీలో కలిసిపోయే అమ్మాయి అయితే చాలనీ అల్లు అర్జున్ తల్లి శ్రీమతి నిర్మల ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. బన్నీ పెళ్లి వార్తలో నిజానిజాలు ఏమటనేవి కొద్దిపాటి ఓపికతో ఎదురుచూస్తే సరి...
Be first to comment on this News / Article!
|