ఏవియస్ 'కోతిమూక'
ప్రముఖ కమెడియన్ ఏవియస్ తాజాగా 'కోతిమూక' అనే కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కృష్ణుడు ('వినాయకుడు' ఫేమ్), శ్రద్ధఆర్య హీరోహీరోయిన్లు. నూతన నిర్మాణ సంస్థ తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏవియస్ ఆ విశేషాలను తెలియజేస్తూ, రచయిత జనార్ధన మహర్షి చెప్పిన కథ, అందులోని ప్రధానాంశం తనకు నచ్చడంతో మళ్లీ దర్శకత్వ పగ్గాలు చేపట్టాననీ, రెండున్నర గంటల సేపు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుందన్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్నారనీ, ఇప్పటికే ఐదు పాటల రికార్డింగ్ పూర్తయిందనీ తెలిపారు. ఈనెల 24 నుంచి ఏప్రిల్ 20 వరకూ జరిగే సింగిల్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతందని నిర్మాత వెంకట జగదీష్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఆలీ, వేణుమాధవ్, గుండు హనుమంతరావు, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, రఘబాబు, హర్షవర్ధన్, కోవైసరళ, హేమ, ఝాన్సీ తదితరులు నటించనున్నారు. జనార్దన మహర్షి రచన, రామజోగయ్యశాస్త్రి-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్ పాటలు, శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|