'సౌండ్ పార్టీ' ప్రారంభం
వజ్రాల చుట్టూ తిరిగే కథాంశంతో 'సౌండ్ పార్టీ' అనే కొత్త చిత్రం రామానాయుడు సినీ వేల్ జ్ లో సోమవారంనాడు ప్రారంభమైంది. దీనికి 'అంతా షోయింగే' అనే ట్యాగ్ లైన్ ఉంది. పార్ధు హీరో కాగా, ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటించనున్నారు. వీరు దర్శకత్వంలో రవికుమార్ రెడ్డి, శ్రీనివాసరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లాప్, స్విచ్చాన్ వంటి ఆనవాయితీ కార్యక్రమాలు లేకుండా షూటింగ్ మొదలైంది.
దర్శకుడు వీరు మాట్లాడుతూ, బుధవారం నుంచి రెగ్యులర్ షూటంగ్ ప్రారంభించి ఇక్కడే కొద్దిరోజులు షూటింగ్ జరుపుతామని చెప్పారు. ఈనెల 20 నుంచి బ్యాంకాక్ లో షూటింగ్ ఉంటుందనీ, తిరిగి వచ్చిన తర్వాత హైద్రాబాద్ లో రెండో షెడ్యూల్ చేస్తామనీ తెలిపారు. సంగీతపరంగా ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని సమర్పకుడు సోమా విజయప్రకాష్ తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ 90 శాతం బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నామనీ, పాటలు చిత్రీకరణ కూడా అక్కడే జరుపుతామనీ అన్నారు. హీరోగా తనకిది రెండో చిత్రమని పార్ధు చెప్పారు. సమావేశంలో చిత్ర సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, కొండవలస, తెలంగాణ శకుంతల, సురేఖావాణి తదతరులు నటించనున్నారు. మరుధూరి రాజా మాటలు, రాజేంద్ర సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|